ముంబై, మే 5: విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్ 28తో ముగిసిన వారాంతానికిగాను 4.532 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ నిల్వలు 588.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంలో 2.164 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వులు ఆ తర్వాతి వారం లో పెరిగాయి.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 5 బిలియన్ డాలర్లు పెరిగి 519.485 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. బంగారం రిజర్వులు 494 మిలియన్ డాలర్లు తగ్గి 45.657 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.