Forex Reserves | ముంబై, అక్టోబర్ 18: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. వరుసగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఫారెక్స్ రిజర్వులు గత వారాంతానికిగాను 700 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఈ నెల 11తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 10.746 బిలియన్ డాలర్లు తరిగిపోయి 690.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 10.542 బిలియన్ డాలర్లు తగ్గి 602.101 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే పసిడి రిజర్వులు 98 మిలియన్ డాలర్లు తగ్గి 65.658 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.