న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఎఫ్డీఐలు 23.6 శాతం ఎగబాకి 27.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
క్రితం ఏడాది ఇదే సమయంలో భారత్లోకి 22.4 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చాయి. దీంట్లో నికర ఎఫ్డీఐలు 3.8 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తన బుల్టెన్లో పేర్కొంది. సింగపూర్, మారిషస్, నెదర్లాండ్స్తోపాటు అమెరికా, బెల్జీ యం, జపాన్ దేశాల నుంచి అత్యధిక ఎఫ్డీఐలు వచ్చాయని పేర్కొంది