Ford Motors | ఫోర్డ్ యూ-టర్న్- భారత్‌లో తయారీకి రెడీ.. ఎందుకంటే?!
Ford Motors | అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ యూ-టర్న్ తీసుకుంది. భారత్ నుంచి నిష్కమిస్తానన్న ఫోర్డ్ వెనుకడుగు వేసింది.
Ford Motors | భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది మధ్యలో ప్రకటించింది కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్. కానీ.. ఈ అమెరికా సంస్థ యూ-టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నది. భారత్‌లో కార్ల ఉత్పత్తిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రణాళిక రూపొందిస్తున్నది. విద్యుత్ కార్ల తయారీపై లబ్ధి పొందడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కోసం ఫోర్డ్ మోటార్స్ దరఖాస్తు చేసుకున్నది.
ఫోర్డ్‌తోపాటు మారుతిసుజుకితో సహా 20 కార్ల తయారీ సంస్థలు పీఎల్‌వో కోసం బారులు తీరాయి. దేశీయంగా విద్యుత్ వాహనాలను తయారు చేసి విక్రయించిన సంస్థలకు కేంద్రం.. పీఎల్ఐ కింద రూ.25,938 కోట్ల మేరకు లబ్ది చేకూరుస్తుంది.దేశీయంగా గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్ కలిగి ఉన్న ఫోర్డ్.. ఇక్కడి నుంచే 100 శాతం ఎలక్ట్రిక్ కార్ల తయారీతోపాటు విదేశాలకు ఎగుమతి చేయాలని సంకల్పించింది.
పీఎల్ఐ కింద ఫోర్డ్ సమర్పించిన దరఖాస్తుకు కూడా కేంద్రం ఆమోదం లభించింది. తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ఫోర్డ్ ఇండియా ట్విట్టర్ వేదికగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. కేంద్రం ఆమోదం పొందిన సంస్థలు వచ్చే రెండేండ్లలో స్ట్రాటర్జీ, ప్రొడక్స్ మీద దృష్టి సారిస్తాయి. 2024 నుంచి ఐదేండ్ల పాటు పీఎల్ఐ అమలవుతుందని కేంద్రం వెల్లడించింది.
గతేడాది భారత్ మార్కెట్ నుంచి నిష్కమిస్తామని ప్రకటించినప్పుడు.. భారత్‌లో మార్క్యూ, ముస్తాంగ్ బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తామని ఫోర్డ్ తెలిపింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ రివల్యూషన్‌కు సారధ్యం వహించాలని ఫోర్డ్ భావిస్తున్నది. భారత్‌లోని విద్యుత్ వాహనాల తయారీ ప్లాంట్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగించుకోవాలని తలపోస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

