No IT Deductions | ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపుపై వేతన జీవులు భారీగా పెట్టుకున్న ఆశలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీళ్లు చల్లారు. ఐటీ రిటర్న్స్‌లో శ్లాబ్‌లు గానీ, మినహాయింపులు, రాయితీల ఊసే ఎత్తలేదు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో స్టాండర్డ్ పన్ను డిడక్షన్ రూ. లక్షకు పెంచుతారని వేతన జీవులు ఆశగా ఎదురు చూశారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులకు ఇచ్చే వర్క్ ప్రం హోం అలవెన్స్‌ల కోసం ప్రత్యేక నిబంధన తీసుకొస్తారని అంతా అంచనా వేశారు. కానీ నిర్మలా సీతారామన్ అటువంటి ప్రతిపాదనలేమీ లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగించారు.