Nirmala Sitharaman | న్యూఢిల్లీ, ఆగస్టు 10: డిపాజిట్‌దారులను ఆకట్టుకునేలా బ్యాంకులు ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకురావలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు. రిజర్వుబ్యాంక్ బోర్డు సమావేశం అనంతం మంత్రి మాట్లాడుతూ..రుణాలకు, డిపాజిట్లకు సమతూకం ఉండాలని, డిపాజిట్ల సేకరణపై బ్యాంకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా వచ్చిన నిధులను రుణాలుగా సమకూర్చుకోవచ్చునన్నారు.
భారత్‌లో ఇంటి పొదుపు పెరిగిపోతున్నదని, దీంతో వారు తమ పొదుపును ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బ్యాంకులు మరింత చొరవ చూపించాలని ఆమె సూచించారు. ఇందులో భాగంగా వినూ త్న, ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను అందుబాటులోకి తీసుకురావలని, తద్వారా ఎంతోమంది డిపాజిట్లు చేయడానికి ముందుకొచ్చే అవకాశాలుంటాయన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఏఐ సంస్థలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలను సిద్ధంగా ఉన్నాయని టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ కుమార్ అన్నారు.
కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లా లో 30కి పైగా ఏఐ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, ఏఐ హబ్ తరహాలో ఎదగాలన్న తెలంగాణ లక్ష్యం దిశగా టీ కన్సల్ట్ పనిచేస్తున్నదని వివరించారు. తద్వారా భారీ పెట్టుబడులతోపాటు 4 వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు.