హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) 41వ జాతీయ వార్షిక సదస్సు సందర్భంగా ఫ్లో హైదరాబాద్ విభాగానికి 4 జాతీయ అవార్డులు లభించాయి. ఫ్లో లెగసీ బిల్డర్ అవార్డు, స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, ఫ్లో గ్రాస్రూట్స్ ఇంపాక్ట్ అవార్డు, ఫ్లో ఆపర్చ్యునిటీ ఆర్కిటెక్ట్ అవార్డు లభించినట్లు ఫ్లో వర్గాలు తెలిపాయి.
చైర్పర్సన్ ప్రియా గజ్దర్ నేతృత్వంలో మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు విభిన్న రంగాల్లో వారిని రాణిం చే విధంగా కృషిచేస్తున్నందుకుగాను తమకు ఈ అవార్డులు లభించినట్లు ఫ్లో హైదరాబాద్ విభాగం ప్రతినిధులు తెలిపారు.