న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Republic Day Sale) ఈనెల 14 నుంచి రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించనుంది. అప్‌కమింగ్ సేల్ ఈవెంట్ గురించి కంపెనీ ఇప్పటికే తన ప్లాట్‌ఫామ్స్‌పై టీజర్ పబ్లిష్ చేయడంతో పాటు తక్కువ ధరలో లభించే ఫోన్ల వివరాలను కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ సేల్ జనవరి 14న ప్రారంభమై 19 వరకూ కొనసాగుతుంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు సేల్ ఈవెంట్ ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15, పిక్సెల్ 8 వంటి ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయ ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 వంటి యాపిల్ డివైజ్లతో పాటు పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21, ఎఫ్ఈ 5జీ, మొటొరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రొ, ఒప్పో రెనో 10 ప్రొ, వివో టీ2ఎక్స్, రియల్మీ 11, రెడ్మి 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ వంటి స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరల్లో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
ఇక ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్ధి అమెజాన్ కూడా తన ప్లాట్‌ఫాంపై రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తోంది. ఇక అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, రెడ్మి 12, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11ఆర్ వంటి డివైజ్‌లపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది.
Read More :