Flipkart Big Billion Days Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఇవీ ఆఫర్లు.. !
Flipkart Big Billion Days Sale | ఓనం వేడుకలతో పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు మొదలు స్మార్ట్ టీవీలు, హోం అప్లియెన్సెస్ తదితర వస్తువులపై ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతాయి.
Flipkart Big Billion Days Sale | గత నెలాఖరులో ఓనం వేడుకలతో పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ప్రియులను, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు కొనుగోలు చేసే విద్యార్థులను ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కొనుగోలు చేసే వారిని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ‘ఫ్లిప్‌కార్ట్’, అమెజాన్ ఇండియా పోటీ పడుతున్నాయి. తాజాగా ‘ఫ్లిప్ కార్ట్’ బిగ్‌బిలియన్ డేస్ సేల్ -2023’ అధికారికంగా ప్రకటించింది. వారం పొడవునా సాగే ఆన్ లైన్ విక్రయాలు అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఇంతకుముందు మాదిరిగానే ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ సభ్యులకు 24 గంటల ముందు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీలు సహా వందల ఉత్పత్తులపై ఆసక్తికర ఆఫర్లు హామీ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
ఇన్ స్టంట్ డిస్కౌంట్ నుంచి ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వరకూ..
ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకుతోపాటు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్డులపై కొనుగోలు చేసినా, ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకున్నా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్ బేస్డ్ ఆఫర్లు కూడా ప్రకటించింది. ఆపిల్, ఐక్యూ, వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మీ, షియోమీ తదితర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఫీచర్ కూడా ఉపయోగించుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ నుంచి ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి.
ఈ ఫోన్లపై స్పెషలాఫర్లు ఇలా
మోటో జీ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ, రియల్మీ సీ 51, రియల్మీ 11 5జీ, రియల్మీ 11ఎక్స్ 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ, మోటో జీ84 5జీ, వివో వీ29ఈ, పొకో ఎం6 ప్రో 5జీ మోడల్ ఫోన్లపై ఆఫర్లు లభిస్తాయి. ఐ-ఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎ23 ఆల్ట్రా మోడల్ ఫోన్లపైనా ధరలు తగ్గించవచ్చు.
ఆఫర్లు లభించే కొత్త ఫోన్లు ఇలా
అదనంగా ఇటీవలే మార్కెట్లో కొత్తగా ఆవిష్కరించిన మోటో ఎడ్జ్ 40 నియో, వివో టీ20 ప్రో 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, అక్టోబర్ నాలుగో తేదీన ఆవిష్కరించే వివో వీ29 సిరీస్ ఫోన్లపైనా ధరలు తగ్గిస్తున్నది.
అక్టోబర్ 8-15 మధ్య ఆఫర్లు ఇలా
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ లో భాగంగా అక్టోబర్ 8-15 తేదీల మధ్య ఆఫర్లు లైవ్‌లో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, విడి భాగాలు, స్మార్ట్ ఫోన్లు, హోం అప్లియెన్సెస్ మీద 80 శాతం వరకూ, ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం వరకూ, బ్యూటీ, హోం డెకరేషన్, స్పోర్ట్స్ ఐటమ్స్ మీద 80 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

