Flip Phone : ప్రముఖ మొబైల్ ఫోన్ల (Mobile Phones) తయారీ సంస్థ అయిన మోటోరొలా (Motorola) మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటరోలా రేజర్ 60 (Motorola Razr 60)’ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను రూ.50 వేలలోపు బడ్జెట్లో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకతల (Specifications) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిలో 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ pOLED ఎల్టీపీఓ డిస్ప్లేతో ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఔటర్ డిస్ప్లే 3.63 అంగుళాల pOLED డిస్ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేటు, 1700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హల్లో యూఐతో పనిచేస్తుంది.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్‌తో లభిస్తోంది. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. IP48 రేటింగ్, ఏఐ ఇమేజింగ్ టూల్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. 4,700mAh బ్యాటరీతో తీసుకొచ్చిన మొబైల్ 30W టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే ఈ ఫోల్డబుల్ ఫోన్ లభించనుంది. 8జీబీ +256జీబీ ర్యామ్, రోమ్తో ఈ ఫోన్ వస్తోంది. ఈ వేరియంట్ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 4 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర రిటైల్ దుకాణాల్లో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.