న్యూఢిల్లీ, మే 21: కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను జూలై బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల నుంచి మరింత డివిడెండ్లను ఆశించబోతున్నది.
ఫిబ్రవరి 1న ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో ఆర్థికేతర సీపీఎస్ఈల నుంచి రూ.48,000 కోట్లుగా డివిడెండ్లను అంచనా వేశారు. అయితే ఈ డివిడెండ్ల లక్ష్యాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో రూ.5,000 కోట్లు పెంచి రాబోయే బడ్జెట్లో దాదాపు రూ.53,000 కోట్లుగా చేయవచ్చని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్తున్నారు.