హైదరాబాద్, ఆగస్టు 30: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి మరో రెండు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీబీ 125 హార్నెట్, షైన్ 100 డీఎక్స్ మాడళ్లను పరిచయం చేసింది.
వీటిలో హోండా సీబీ 125 హార్నెట్ ధర రూ.1.12 లక్షలు కాగా, షైన్ 100 డీఎక్స్ మాడల్ రూ.75,950గా నిర్ణయించింది. సీబీ125 హార్నెట్‌లో ట్విన్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్ట్‌తో 4.2 ఇంచుల టీఎఫ్టీ డిస్ప్లేతో కాల్ మాట్లాడుకోవచ్చును, ఎస్ఎంఎస్ అలర్ట్‌ను తిలకించవచ్చును.