హైదరాబాద్, మార్చి 7: ప్రముఖ గేమింగ్ సంస్థ 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మక బెస్ట్ అనిమేటెడ్ ఫ్రేమ్స్ అవార్డు వరించింది. బెస్ట్ ఇండియన్ గేమింగ్ విభాగంలో ఈ అవార్డును ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అందచేసింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కంపెనీ ఎండీ మారుతి శంకర్ ఇటీవల అందుకున్నారు.