PayTM ‘Navratri Gold’ | సిలిండర్ బుక్ చేస్తే నవరాత్రి గోల్డ్ పొందొచ్చు.. ఎలాగంటే?!
PayTM 'Navratri Gold' | తమ యాప్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే రూ.10,001 విలువైన బంగారం పొందే చాన్స్ పేటీఎం కల్పిస్తోంది.

PayTM ‘Navratri Gold’ | నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచి ఆఫర్ తీసుకొచ్చింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నవారు రూ.10,001 విలువైన గోల్డ్ గెలుచుకునే చాన్స్ కల్పిస్తోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి 16 వరకు ఐదుగురు యూజర్లకు ఈ అవకాశం లభిస్తుంది. ఇప్పటికే సిలిండర్లు బుక్ చేసుకుని డబ్బు చెల్లించని వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
పేటీఎం యాప్ నుంచి సిలిండర్ బుకింగ్ ఇలా..
కస్టమర్లు చేయాల్సిందల్లా ఒకటే పేటీఎం యాప్లోకెళ్లి బుక్ గ్యాస్ సిలిండర్ ఫీచర్ను వాడి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. అటుపై కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్,. ఎల్పీజీ ఐడీ, కన్జూమర్ నంబర్ ఫీడ్ చేయాలి. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న కస్టమర్లు మోడ్ ఆఫ్ పేమెంట్ను ఎంచుకోవచ్చు. పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, పేటీఎం కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.

ఈ నెల బుకింగ్.. వచ్చేనెల పేమెంట్ ఆప్షన్ కూడా..
అంతేకాదు.. యూజర్లు ఇప్పుడు సిలిండర్ బుక్ చేసుకుని వచ్చేనెల పే చేసే ఆప్షన్ కూడా పేటీఎం కల్పిస్తోంది. ప్రతి సిలిండర్ బుకింగ్ మీద యూజర్లకు 1000 క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. వీటిపై డీల్స్ రీడీమ్ చేసుకోవచ్చు. పలు ప్రధాన బ్రాండ్లపై గిఫ్ట్ ఓచర్లు కూడా వస్తాయి. ఇండేన్, హెచ్పీ గ్యాస్, భారత్ గ్యాస్ కంపెనీల్లో వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

