న్యూఢిల్లీ, మే 18: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలు మరింత సరళతరంకాబోతున్నాయి. ఇటీవల స్పేస్ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులను నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర సర్కార్..ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు మారే అవకాశాలున్నాయని. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్కార్ ఈ నిబంధనలను మార్చే అవకాశాలున్నాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.
ఏప్రిల్-డిసెంబర్ 2023 మధ్యకాలంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 13 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాల్లో ఎఫ్డీఐలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీమ్స్(పీఎల్ఐ) కింద ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అలాగే ఈ సంస్థలు రూ.9 లక్షల కోట్ల విక్రయాలు జరపగా, రూ.3.45 లక్షల కోట్ల ఎగుమతులు చేశాయని, 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయన్నారు.