హైదరాబాద్, డిసెంబర్ 11: ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వహణ సంస్థ వండర్లా…మహిళలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
ప్రతి బుధవారం హైదరాబాద్‌లోని వండర్లా పార్క్‌ను సందర్శించే మహిళలు కొనుగోలు చేసే రెండు టిక్కెట్లపై మరో రెండు టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తించనున్నది.