Facebook COO Resign | సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేరెంట్ బాడీ మెటా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెర్య్ల్ శాండ్‌బర్గ్ తన పదవికి రాజీనామా చేశారు. ఫేస్బుక్ ఖాతా నుంచి తన రాజీనామాను ప్రకటించారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ఇదే సరైన టైం అని పేర్కొన్నారు. రాజీనామా చేయడానికి అంతకుముందు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో భేటీ అయ్యారు. 2008లో 14 ఏండ్ల క్రితం ఫేస్బుక్ పెనవేసుకున్న అనుబంధాన్ని శాండ్‌బర్గ్ తెగదెంపులు చేసుకున్నారు.
ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తర్వాత స్థానంలో షెర్య్ల్ శాండ్‌బర్గ్ నిలిచారు. శాండ్‌బర్గ్ స్థానంలో కొత్త సీవోవోగా జావియర్ ఓలివాన్ను నియమిస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఫేస్‌బుక్‌ను స్టార్టప్ నుచి అతిపెద్ద డిజిట్ అడ్వర్టైజింగ్ సామ్రాజ్యంగా అభివృద్ధి చేయడంలో శాండ్బర్గ్ది కీలక పాత్ర. అడ్వర్టైజింగ్ ద్వారా ఏటా ఫేస్బుక్ ఏటా 100 బిలియన్ల డాలర్ల రెవెన్యూ సంపాదిస్తున్నది.
శాండ్‌బర్గ్ తన కెరీర్లో వివాదాలను పెనవేసుకున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసిందని, దీనికి ఫేస్బుక్ శాండ్‌బర్గ్ నిర్ణయాలే కారణమన్న విమర్శలు ఉన్నాయి. కొత్త సీవోవోగా నియమితులైన జావియర్ ఒలివాన్ 2007లో ఫేస్బుక్లో చేరారు. అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్‌లకు పేరెంట్ బాడీ మెటాలో బోర్డు సభ్యురాలిగా శాండ్‌బర్గ్ కొనసాగుతారని జుకర్‌బర్గ్ తెలిపారు.