న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 : ఉచిత వైఫై సర్వీస్ అంచనా.. పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ విస్తరణలో ప్రధాన మానసిక, ఆర్థిక అడ్డంకిని సృష్టిస్తున్నదని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం విడుదల చేసిన ఓ కన్సల్టేషన్ పేపర్లో అభిప్రాయపడింది. ‘భారత్‌లో పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ వ్యాప్తి’పై తెచ్చిన సంప్రదింపు పత్రంలో.. భారతీయ వినియోగదారులు 4జీ/5జీ మొబైల్ డాటా అధిక ధరల కారణంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని దాదాపు విలువలేని వస్తువుగా చూస్తున్నారని, అందుకే మళ్లీ పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్ కోసం కనీసం రూ.5 లేదా రూ.10నైనా ఖర్చు చేసేందుకు వారు ఎంతమాత్రం సిద్ధంగా లేరని పేర్కొన్నది.
ఈ రకమైన ధోరణి వాణిజ్యపరమైన హాట్‌స్పాట్ ప్రొవైడర్లను ప్రభావితం చేస్తున్నదని చెప్పింది. దాదాపు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వారి డాటా ప్యాక్‌తోనే సరిపడా ఇంటర్నెట్ వస్తున్నదని గుర్తుచేసింది. కాగా, ట్రాయ్ పేపర్‌పై కామెంట్స్‌కు మే 25 ఆఖరు తేదీ.