Reliance | గతవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభ పడ్డాయి. వాటిల్లో ఐటీసీ అత్యధికంగా లబ్ధి పొందింది. తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,88,366.69 కోట్లు వృద్ధి చెందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.5,885.97 కోట్లు నష్టపోయి రూ.15,75,715.14 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1510 పాయింట్ల (2.54 శాతం) లాభంతో ముగిసింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,321.81 కోట్లు వృద్ధి చెంది రూ.4,72,353.27 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.34,043.38 కోట్లు పెరిగి రూ.6,72,935.25 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,239.66 కోట్ల వృద్ధితో రూ.6,02,749 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.26,143.92 కోట్లు పెరిగి రూ.12,74,026.80 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,900.84 కోట్లు పుంజుకుని రూ.9,25,188.45 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.10,432.23 కోట్లు పెరిగి రూ.4,42,015.45 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,988.61 కోట్ల వృద్ధితో రూ.6,21,678.35 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.6,503.28 కోట్లు పెరిగి రూ.4,92,313.07 కోట్ల వద్ద స్థిర పడింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.3,792.96 కోట్లు వృద్ధి చెంది రూ.4,85,900.49 కోట్ల వద్ద నిలిచింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్పోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.