ఈపీఎఫ్ వడ్డీ : 40 లక్షల మంది చందాదారులకు చెల్లింపుల్లో జాప్యం

న్యూఢిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ చందాదారులకు వడ్డీ మొత్తం జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు దాటినా ఇంకా 40 లక్షల మంది సబ్స్క్రైబర్లకు వడ్డీ చెల్లింపులు పూర్తికాలేదు. కేవైసీ వివరాలు సరిపోల్చడంలో సమస్యలు, యజమానుల నుంచి ఉద్యోగుల గుర్తింపు వంటి కారణాలతో ఆయా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేయడంలో జాప్యం వాటిల్లింది. వ్యక్తుల ప్రాతిపదికన కాకుండా సంస్థల వారీగా పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ చెల్లింపులు జమవుతాయి. కాగా 2019-20 సంవత్సరానికి గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈపీఎఫ్ వడ్డీని జమ చేస్తామని ఈపీఎఫ్ఓ గతంలో ప్రకటించింది.
పీఎఫ్ కార్పస్ నిధిపై 8.5 శాతం వడ్డీ రేటు చొప్పున ఆరు కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో ఒకేవిడతలో వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. వీరిలో ఎనిమిది నుంచి పదిశాతం సబ్స్క్రైబర్లకు ఇప్పటివరకూ వడ్డీ జమకాలేదు. అయితే చెల్లింపులో జాప్యం నేపథ్యంలో ఉద్యోగుల వివరాలపై ఈపీఎఫ్ఓ క్షేత్రాధికారులు యాజమాన్యలను సంప్రదిస్తున్నారని బిజినెస్ డైలీ మింట్ కథనం పేర్కొంది. ప్రభుత్వం నిర్ధేశించిన వడ్డీ రేటు ప్రకారం ఈపీఎఫ్ఓ ఏటా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ మొత్తం జమచేస్తుంది.
తాజావార్తలు
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
- నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తా
- నా కష్టాలు గుర్తొచ్చాయి
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- జవ్వని సొగసుకు..జడ నగలు!
- ములుగు పిజ్జా.. మహా రుచి!
- గ్రీన్ పకోడి
- మహిళకు ‘పింక్' రక్ష!