Mammootty | దశాబ్ధాలుగా మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందిస్తూ.. వయస్సుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు మాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోలు మోహన్‌లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty). వయస్సు శరీరానికి మాత్రమే యాక్టింగ్‌కు కాదని చెప్పకనే చెబుతూ.. బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ కుర్రహీరోలు సైతం షాకయ్యేలా చేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారని తెలిసిందే.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాత్మక సినిమాలతో అభిమానుల ముందుకొచ్చే ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని తెలిసిందే. ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే కాదు.. ఒకరినొకరు ఆప్యాయంగా కిస్ చేసుకుంటే ఎలా ఉంటుంది. అభిమానులు, మూవీ లవర్స్‌కు మాత్రం చూసేందుకు రెండు కండ్లు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అరుదైన దృశ్యమే వనిత ఫిలిం ఫేర్ అవార్డ్సు 2024 ఈవెంట్లో కనిపించింది.
ఈవెంట్లో మోహన్ లాల్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ , మమ్ముట్టి ఒకరినొకరు ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నారు. ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ స్టార్ హీరోల అరుదైన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
❤️🫰#Mohanlal #Mammootty pic.twitter.com/LZ0gHHljJ1
— Mohanlal Media Club (@MohanlalClub) April 23, 2024
ഇച്ചാക്കയ്ക്ക് ലാലുവിന്റെ ചക്കര ഉമ്മ ♥️🥰
Bonding 🥹🥰❣️@Mohanlal #Mohanlal #Mammootty @mammukka pic.twitter.com/uXm52Runu4
— Adhi (@AdhiMFC2255) April 22, 2024
Not any other industry in world cinema had like these two 🐐🐐’s💯 having ,
43+ years of bond🤝
More than friendship & brotherhood,
soulmate’s❤️
Pillars of #Mollywood 🔥#Mammootty – #Mohanlal pic.twitter.com/V8z2fCh5Hb— Ganesh R Enrique (@ganesh_enrique) April 23, 2024