WE Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మహిళలకు చేయూతనిచ్చేలా ప్రాజెక్ట్ ఇంక్లూజన్ ఎంతగానో సహకరిస్తుందని వీ-హబ్ సీఈవో సీతా పల్లాచొల్ల తెలిపారు. గురువారం ఇక్కడి వీ-హబ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రాజెక్ట్ ఇంక్లూజన్ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీ-హబ్ కృషి చేస్తున్నదన్నారు. అదేవిధంగా మహిళలు ఆంత్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తున్నామని వివరించారు. కాగా, మోడల్ ఎంఎస్ఎంఈల అభివృద్ధి, స్థాపనకు 6 నెలలపాటు ప్రాజెక్ట్ ఇంక్లూజన్ సాగుతుందని సీత స్పష్టం చేశారు. దీనికి రీసైస్టెనబులిటీ సంస్థ సీఎస్ఆర్ భాగస్వామిగా ఉందని వెల్లడించారు.