23 నుంచి భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు!
23 నుంచి భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసులు! దుబాయి నుంచి భారత్‌కు ఈ నెల 23 వరకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించిం....

దుబాయి: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్‌తో సహా వివిధ దేశాలకు విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వాటిని సడలించింది. దుబాయి నుంచి భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నది. ఈ నెల 23 నుంచి విమాన సర్వీసులు మొదలవుతాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు శనివారం జరిగిన క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుప్రీం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆమోదించిన వ్యాక్సిన్లు వేయించుకున్న వారు దుబాయికి వచ్చేందుకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే, విమానం బయలు దేరడానికి 48 గంటలు ముందుగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించిన వారిని కూడా ప్రయాణానికి అనుమతినిస్తారు.
భారత్ నుంచి ప్రయాణికుల విమానాలను వచ్చే నెల ఆరో తేదీ వరకు సస్పెండ్ చేసింది. అయితే, యూఏఈ గోల్డెన్ వీసాదారులు, వివిధ దేశాల దౌత్యాధికారులకు ఈ ఆంక్షలు వర్తించబోవని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

