న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : బరువు తగ్గే ఔషధాన్ని దేశీయంగా ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఆవిష్కరించింది. ‘పోవిజ్ట్రా’ పేరిట సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ను తీసుకొచ్చింది. ఇదో పెన్ డివైజ్. 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ, 1.7 ఎంజీ, 2.4 ఎంజీలలో లభిస్తుందని సోమవారం కంపెనీ తెలియజేసింది.
వారానికి ఒకటి చొప్పున 4 వారాల మోతాదుల ఖరీదు రూ.8,790గా ఉన్నది. వైద్యుల సూచనల ప్రకారం వాడుకోవచ్చు. దేశంలో 25.4 కోట్ల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని కంపెనీ సీఈవో సతీష్ మెహెతా చెప్పారు.