Ever grande EV | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న చైనా రియాల్టీ సంస్థ ఎవర్‌గ్రాండే అనుబంధ ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్ వచ్చే ఏడాది నుంచి కార్ల తయారీని ప్రారంభిస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఎవర్‌గ్రాండే ఈవీ యూనిట్ కార్ల తయారీ ప్రారంభానికి సిద్ధం కావడం గమనార్హం.
కార్ల ప్లాంట్ నిర్మించడానికి కోస్తా నగరం టియాంజిన్‌లో స్థానిక అధికారులతో, సప్లయర్స్‌తో ఎవర్‌గ్రాండే ఈవీ యాజమాన్యం చర్చలు జరిపింది. వచ్చే ఏడాది నుంచి భారీ స్థాయిలోకార్లను ఉత్పత్తి చేస్తామని తన వెబ్సైట్లో ప్రకటించింది.
ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, ఇతర వ్యయాలకు అవసరమైన నిధుల సేకరణలో సమస్యలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనూ నూతన ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు, తన ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకోవాలని ఎవర్‌గ్రాండే ఈవీ భావిస్తున్నది.