EMA Partners India IPO | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఈఎంఏ పార్టనర్స్ ఇండియా (EMA Partners India) ఐపీఓ ఈ నెల 17న ప్రారంభం కానున్నది. సంస్థ రూ.76 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ఐపీఓకు వెళుతోంది. ఐపీఐ ప్రైస్ బాండ్ విలువ రూ.117-124గా నిర్ణయించింది ఈఎంఏ పార్టనర్స్ ఇండియా. ఈ నెల 21న ఐపీఓ ముగియనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 16న బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు కంపెనీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఓ ద్వారా రూ.76.01 కోట్ల నిధులు సేకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీఓ ద్వారా బిడ్ దాఖలు చేసే ప్రతి ఇన్వెస్టర్ కనీసం వెయ్యి షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజా షేర్ల జారీ ద్వారా 53.34 లక్షల షేర్లు జారీ చేసి రూ.66.14 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా మిగతా నిధులు కంపెనీ ప్రమోటర్లు కృష్ణన్ సుదర్శన్, సుబ్రమణ్యన్ కృష్ణ ప్రకాశ్లకు చెందిన 7.96 లక్షల షేర్లు విక్రయిస్తారు. ఈ మేరకు కంపెనీ ఈ నెల తొమ్మిదో తేదీన ఐపీఓకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సెబీకి రెడ్ హెర్రింగ్ ప్రాస్సెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) ఫైల్ చేసింది. కంపెనీ ప్రమోటర్ శేఖర్ గణపతి కూడా తన వాటాను విక్రయిస్తారు.
ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు 50 శాతం. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లు కేటాయిస్తారు. 2003 సెప్టెంబర్‌లో కృష్ణన్ సుదర్శన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సుబ్రమణ్యం కృష్ణ ప్రకాశ్‌లు ప్రమోటర్లుగా ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ అసోసియేట్స్ ఇండియా ఏర్పాటైంది. దాన్ని తర్వాత ఈఎంఏ పార్టనర్స్ ఇండియాగా మార్చేశారు. ఐపీఓ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఇండోరియెంట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వ్యవహరించనున్నది. ఐపీఓ రిజిస్ట్రార్‌గా బిగ్‌షేర్ సర్వీసెస్ పని చేస్తుంది.