Mutual Funds | ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్)లో సంపద వృద్ధికి, పన్ను ఆదాకూ ఆస్కారముంటున్నది. ఫలితంగా మూడేండ్ల లాకిన్ పీరియడ్‌తో ఉన్న ఈ పథకాలు.. యువ ఇన్వెస్టర్లకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయాయిప్పుడు. స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ సంబంధిత సాధనాల్లో ప్రధానంగా వీటి పెట్టుబడులుంటాయి.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ సేవింగ్ ప్రోత్సాహకాలనూ మదుపరులు పొందే వీలున్నది. రూ.1.5 లక్షలదాకా ఐటీ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. కాగా, పెట్టుబడి లక్ష్యాలు, ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్, ఫండ్ ప్రదర్శన, ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు, మదుపర్ల వ్యూహాలు, వ్యయ నిష్పత్తి తదితర అంశాలనుబట్టి ఈఎల్ఎస్ఎస్ ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం.
అలాగే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు, ఇతరత్రా పోటీ ఫండ్లలో రాబడుల అంచనాల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణుల సలహా. ఇక ఈఎల్ఎస్ఎస్లో రెగ్యులర్‌గా పెట్టుబడులు పెట్టేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంచుకోవచ్చు.