Elon Musk on Twitter | సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను కొనేస్తానని ఆఫర్ చేసిన ఎలన్‌మస్క్ ఆ దిశగా మరో కీలక అడుగేశారు. టెండర్ ఆఫర్ ద్వారా ట్విట్టర్లో 46.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి నిధులు సిద్ధం చేసుకున్నట్లు గురువారం యూఎస్ రెగ్యులేటర్ల ఫైలింగ్‌లో తెలిపారు. తనకు తాను 33.5 బిలియన్ల డాలర్లు, 21 బిలియన్ల డాలర్లు ఈక్విటీలు, 12.5 బిలియన్ల డాలర్లు రుణాల ద్వారా నిధులు సేకరించడానికి పూనుకున్నట్లు తెలిపారు. మోర్గాన్ స్టాన్లీతో సహా పలు బ్యాంకులు మరో 13 బిలియన్ల డాలర్ల రుణం సమకూర్చేందుకు అంగీకరించాయని సమాచారం. ఇదిలా ఉండగా, తాజా పరిణామాలపై స్పందించడానికి ట్విట్టర్ అందుబాటులోకి రాలేదు.
ఒకవేళ ట్విట్టర్ బోర్డు ఆయన ఆఫర్‌కు అనుకూలంగా స్పందించకపోతే మస్క్.. పాయిజన్ పిల్ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాక్ స్వాతంత్య్రాన్ని కోరుకునే ఎలన్‌మస్క్.. భావ ప్రకటనా స్వేచ్ఛకు వేదికగా మారాలంటే ప్రైవేట్ సంస్థగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ట్విట్టర్లో రెండో అతిపెద్ద వాటాదారుగా ఎలన్‌మస్క్.. ఆ సంస్థ ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయడానికి ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌తో డీల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్‌తో గానీ, మరే ఇతర బిడ్డర్‌తో గానీ కలిసి పని చేసేందుకు సిద్ధం అని అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్ తెలిపింది. మస్క్‌తోపాటు ఇతర బిడ్డర్లకు నిధులు సమకూర్చేందుకు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.