ముంబై, జూలై 24 : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విస్తృతంగా సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో సంబంధమున్న రూ.3,000 కోట్ల మోసపూరిత యెస్ బ్యాంక్ రు ణం కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.
ముంబైలోని 35 చోట్ల ఉన్న 50 కంపెనీలు, 25 మందిపై ఢిల్లీకి చెందిన ఈడీ వర్గాలు సెర్చ్ ఆపరేషన్స్ చేశాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలు, ఇతర కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది.