Phone Tapping Case | స్టాక్ మార్కెట్ల సిబ్బంది ఫోన్ ట్యాపింగ్, స్నూపింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో కం ఎండీ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ కేసుపై దర్యాప్తునకు ఢిల్లీ కోర్టు నుంచి ఈడీ అనుమతి పొందింది. చిత్రా రామకృష్ణకు నాలుగు రోజుల ఈడీకి కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సునయన శర్మ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎస్ఈ రీ-లొకేషన్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చిత్రా రామకృష్ణను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచారు.
కేసు విచారణలో చిత్రా రామకృష్ణ సహాయ నిరాకరణ చేస్తున్నారని, తొమ్మిది రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. కానీ, ఆమెకు న్యాయస్థానం నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా విచారిస్తున్నది. సీబీఐ కేసులో ప్రస్తుతం చిత్రా రామకృష్ణ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.