చిక్కుల్లో శ్రీలంక బ్యూటీ : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ!
పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆమె పేరుతో ఉన్న రూ 7.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సహా పలు ఆస్తులున్నాయి.
న్యూఢిల్లీ : పలు కేసుల్లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆమె పేరుతో ఉన్న రూ 7.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సహా పలు ఆస్తులున్నాయి.
మోసగించిన సొమ్ములో సుఖేష్ జాక్వెలిన్‌కు రూ 5.71 కోట్ల వరకూ బహుమతులుగా ఇచ్చాడని ఈడీ అంచనా వేసింది. సుఖేష్ బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని ఆకట్టుకున్నాడని ప్రచారం సాగింది. మరోవైపు జాక్వెలిన్ సన్నిహిత బంధువులకు 1.7 లక్షల యూఎస్ డాలర్లు, 27000 ఆస్ట్రేలియన్ డాలర్లు ఇచ్చాడని చెబుతున్నారు.
రాజకీయ నేత టీటీవీ దినకరన్ ప్రమేయంతో ఐదేండ్ల కిందటి చీటింగ్ కేసులోనూ సుఖేష్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుఖేష్‌ను ఏప్రిల్ 4న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి రూ 215 కోట్లు అక్రమంగా తీసుకున్నందుకు సుఖేష్‌ను గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసింది. సుఖేష్‌పై దర్యాప్తులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ ఎదుట హాజరవగా దర్యాప్తు ఏజెన్సీ ఆమెను ప్రశ్నించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

