న్యూయార్క్, జూన్ 15: వచ్చే ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలే అవకాశాలున్నాయని ఆ దేశ ఆర్థికవేత్త హ్యారీడెంట్ హెచ్చరించారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో జరిగిన మార్కెట్ పతనం కంటే ఇది అధికంగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. అమెరికా మార్కెట్లు కుప్పకూలితే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉన్నదన్నారు.