Financial Management | ప్రతీ ఒక్కరికీ ఆర్థిక ప్రగతి అనేది అనివార్యం. అది లేకపోతే బతుకు బండి సజావుగా సాగదు మరి. అలాంటి ఆర్థిక ప్రగతికి ప్రధానంగా ఆరు మెట్లుంటాయి. వీటిని అధిరోహిస్తే మన కలల్ని సులభంగా సాకారం చేసుకోవచ్చు. ఆదాయం, ఖర్చులు, పొదుపు, మదుపు, బీమా, ప్రణాళికలే ఆ ఆరు కీలక మెట్లు. ఏ మెట్టు నుంచి అదుపు తప్పినా కిందకు పడిపోవడం ఖాయం.
ఆదాయం సమృద్ధిగా ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఇట్టే చేరుకోవచ్చు. కానీ ఖర్చుల్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. పొదుపునకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్లాలి. పెట్టుబడులకు ప్రాధాన్యాన్నిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. బీమా కొండంత ధైర్యం. మనం లేని రోజున మనవాళ్లకి అదే భరోసా. వీటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేయగలగాలి.