న్యూఢిల్లీ, జూన్ 27: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్డే ఉత్సవాన్ని జరుపుకోనున్నట్టు ప్రకటించింది. జూలై 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పదో ఎడిషన్ ప్రైమ్డే ఉత్సవాల్లో అన్ని రకాల ఉత్పత్తులపై భారీ రాయితీలను అందించను న్నది. ప్రైమ్ మెంబర్లకు అన్ని రకాల ఉత్పత్తులపై 60 శాతం వరకు రాయితీ లభించనున్నది. ప్రైమ్ మెంబర్లపై వసూలు చేసే ఫీజును రూ.500 తగ్గించింది. దీంతో రూ.999 చెల్లించి ప్రైమ్ మెంబర్లుగా చేరవచ్చునని తెలిపింది. కస్టమర్ల అదేరోజు, ఆ తర్వాతి రోజు అందించడానికి ఇప్పటికే వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకున్నది.
28 నుంచి జియోమార్ట్ ఆఫర్లు
దేశంలో అతిపెద్ద డిజిటల్ కామర్స్ సేవలు అందించే జియోమార్ట్..ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు దిగి ఉత్సవ్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల కింద గృహోపకరణాలు, హోమ్ కేర్ ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ యాక్సెసరీస్, ఎంపిక చేసిన 5జీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నది. రూ.12,499కే పోకో ఫోన్, రూ.19,999కే సామ్సంగ్ గెలాక్జీ ఎఫ్35 స్మార్ట్ఫోన్ను అందించనున్నది.