న్యూఢిల్లీ, జనవరి 2: ఇటలీకి చెందిన లగ్జరీ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ..నూతన సంవత్సరానికిగాను నయా ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 8 నూతన బైకులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో మల్టీస్ట్రాడా వీ4 ఆర్ఎస్, డిసర్ట్ ఎక్స్ ర్యాలీ, పనిగేల్ వీ4 రేసింగ్ రెప్లికా 2023, డయావెల్(బెంట్లీ), మాన్‌స్టార్ 30, పనిగల్ వీ4 ఎస్పీ2 30తోపాటు స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్ 2023 మాడల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రెండు మాడళ్లను అందుబాటులోకి తీసుకురానున్న సంస్థ.. రెండో త్రైమాసికంలో మరో రెండు, నాలుగో త్రైమాసికంలో ప్రత్యేక మాడళ్లను పరిచయం చేయబోతున్నది.