న్యూఢిల్లీ, మార్చి 10: లగ్జరీ మొటర్సైకిళ్ళ తయారీ సంస్థ డ్యుకాటీ..సరికొత్త బైకును లాంచ్చేసింది. రూ.12.89 లక్షల విలువైన స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రొను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధరను రూ.12.89 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. డ్యుకాటీ ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశించి 50 ఏండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ఈ బైకు ఎయిర్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో రూపొందించింది. 1971లో సంస్థ డ్యుకాటీ 750 జీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నూతన సంవత్సరంలో విడుదల చేసిన తొలి బైకు ఇదేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 1079 సీసీ ఇంజిన్‌తో కలిగిన ఈ బైకు 86 హెచ్‌పీల శక్తినివ్వనున్నది.