బీఎస్ఎన్ఎల్ భూములకు స్పందన కరువు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా బీఎస్ఎన్ఎల్ భూముల విక్రయం కోసం నిర్వహించిన బిడ్డింగ్ విఫలమయ్యింది. సంస్థకు పలు నగరాల్లో ఉన్న భూములను విక్రయించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా తగిన స్పందన లభించలేదని సంబంధిత వర్గాలు ద్వారా తెలిసింది. దీంతో భూముల అమ్మకానికి నియమ నిబంధనలు, షరతుల్ని సడలించాలని ఈ ప్రక్రియకు నియమితులైన ప్రాపర్టీ కన్సల్టెంట్లను డిజిన్వెస్ట్మెంట్ శాఖ తాజాగా కోరినట్లు సమాచారం. ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు చెందిన ఆరు ప్రాపర్టీల అమ్మకానికి కొత్త ఈ-బిడ్డింగ్ పోర్టల్లో 2021 నవంబర్లో ప్రభుత్వం లిస్ట్ చేసింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు చెందిన నాలుగు భూములు, ఎంటీఎన్ఎల్కు ముంబైలో ఉన్న స్థలాలు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఆరు ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరణ జరుగుతుందని టెలికం శాఖ అంచనా వేసింది. బీఎస్ఎన్ఎల్కు హైదరాబాద్లో రూ. 400 కోట్ల విలువ అంచనా వేస్తున్న స్థలానికి, రాజ్పురాలోని రూ. 70 కోట్ల ఆస్తికి స్పందన లభించలేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆరు ప్రాపర్టీల విక్రయానికి సీబీఆర్ఈ సౌతాసియా, కుష్మాన్ అండ్ వాకెఫీల్డ్, జేఎల్ఎల్ ప్రాపర్టీ, నైట్ ఫ్రాంక్లు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్లోని 11 ఎకరాల భూమికి కనీస బిడ్గా రూ. 402 కోట్లను నిర్ణయించి, బిడ్డర్లు కనీసం రూ. 100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉండాలని నిర్దేశించింది. రాజ్పురాలో 20 ఎకరాల భూమికి బిడ్డర్ల నుంచి రూ.70 కోట్ల కనీస బిడ్ను, రూ.17 కోట్ల నెట్వర్త్ను ప్రభుత్వం కోరింది. భావ్నగర్లో 5 ఎకరాలు, కొల్కతాలో 11 ఎకరాల భూముల్ని కూడా అమ్మకానికి పెట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bsnl
- MTNL
- Residential
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

