న్యూఢిల్లీ, డిసెంబర్ 8: క్యాన్సర్ ఔషధం (ఎఫ్టిలాగిమోడ్ అల్ఫా-ఎఫ్టి) అభివృద్ధి, దాని వ్యాపారం కోసం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఇమ్యూటెప్ లిమిటెడ్ సోమవారం జట్టు కట్టాయి. ఇరు సంస్థలకు చెందిన అనుబంధ సంస్థలైన ఇమ్యూటెప్ ఎస్ఏఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఎస్ఏ ఓ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధులే లక్ష్యంగా కంపెనీలు పనిచేయనున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, జపాన్, చైనా మినహా మిగతా దేశాల్లో ఈ ఔషధం అందుబాటులో ఉంటుందని రెండు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.