న్యూఢిల్లీ, మార్చి 27: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..దేశీయంగా వ్యాక్సిన్ బ్రాండ్లకు ప్రమోషన్ కల్పించడానికి, పంపిణి చేయడానికి సనోఫి హెల్త్‌కేర్ ఇండియాతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా రెడ్డీస్‌కు చెందిన వ్యాక్సిన్లు, పంపిణీ మరింత సులభతరంకానున్నది. రెడ్డీస్‌కు చెందిన వ్యాక్సిన్ బ్రాండ్లు అయిన హెగ్జాగ్జిమ్, పెంటాగ్జిమ్, టెట్రాగ్జిమ్, మెనాక్ట్రా, ఫ్లూక్వాద్రీ, అడాసెల్, అవాగ్జిమ్ 80యూ బ్రాండ్లు ఇక సనోఫి పంపి ణి చేయనున్నది. ఫిబ్రవరి నాటికి ఈ బ్రాండ్ల మొత్తం విక్రయాలు రూ.426 కోట్ల స్థాయిలో ఉన్నది.