హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): దేశీయ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో వెల్డింగ్ టెక్నాలజీ అత్యంత కీలకమని ‘అడ్వాన్స్ వెల్డింగ్ టెక్నాలజీస్ ఇన్ నేషన్ మిషన్స్ ప్రోగ్రామ్స్’ (ఏడబ్ల్యూటీఎన్ఎంపీ) చైర్మన్ డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్ (ఐఐడబ్ల్యూ) బ్రాంచ్‌లో డీఆర్డీఎల్, ఏడబ్ల్యూటీఎన్ఎంపీ సంయు క్త నిర్వహణలో రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోనూ వెల్డింగ్ టెక్నాలజీ పాత్ర ఉన్నదన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాస మూర్తితోపాటు డీఎంఆర్ఎల్ మాజీ డైరెక్టర్ జీ మధుసూధన్ రెడ్డి, ఐఐడబ్ల్యూ హైదరాబాద్ శాఖకు చెందిన శ్రీనివాస మూర్తి వివిధ ప్రయోగశాలల నుంచి 120 మందికిపైగా సైంటిస్టులు హాజరయ్యారు.