న్యూఢిల్లీ, జూలై 13: ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. దీంతో టెలికం అధికారి రాబర్ట్ జే రవికి కంపెనీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
2019 జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన పుర్వార్.. ఐదేండ్లపాటు విధులు నిర్వహించినప్పటికీ, పదవీకాలాన్ని పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేంద్ర సర్కార్ ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. ఇండియన్ టెలికం సర్వీసు అధికారైన రవి.. టెలికం రంగంలో 34 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.