సూచీల హైజంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు రూపాయి భారీగా లాభపడటం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి.
ముంబై, అక్టోబర్ 13: ఎల్టీసీజీ ట్యాక్స్‌ను ఎత్తివేస్తున్నట్టు వచ్చిన వార్తలు మదుపర్లలో ఉత్సాహాన్నినింపింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక దశలో 1,120 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 73 వేల పాయింట్ల కీలక మైలురాయిని అధిగమించింది. చివరికి 1,109.10 పాయింట్లు లేదా 1.54 శాతం లాభపడి 73,033.78 వద్ద స్థిరపడింది.
గడిచిన నాలుగు నెలల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 358.60 పాయింట్లు లేదా 1.60 శాతం అందుకొని 22,721.95 వద్ద స్థిరపడింది. గడిచిన రెండు నెలల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో లాభపడటం కూడా ఇదే తొలిసారి.
4 లక్షల కోట్లు పెరిగిన సంపద
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపర్ల సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.4.12 లక్షల కోట్లు పెరిగి రూ.470 లక్షల కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

