భారీగా లాభపడ్డ సూచీలు.. సెన్సెక్స్ 918, నిఫ్టీ 275 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కె ట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు కదంతొక్కాయి. వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి.
ముంబై, ఏప్రిల్ 10 : దేశీయ స్టాక్ మార్కె ట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు కదంతొక్కాయి. వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతుండటంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగొస్తుండటం మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రోత్సహించిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం అందుకొని 77,550.25 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం అందుకొని 24,050.60 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటం మదుపర్లలో ఉత్సాహన్ని నింపిందని, అలాగే క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అత్యధికంగా లాభం చేకూరే దేశాల్లో భారత్ ముందువరుసలో ఉండటం కూడా సూచీలు ర్యాలీకి దోహదపడిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
- ఏషియన్ పెయింట్స్ 4 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.
- దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండిగో, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
- అలాగే అదానీ పోర్ట్స్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, ఎటర్నల్, మారుతి, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్, ఎయిర్టెల్, బీఈఎల్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు బలపడ్డాయి.
- సన్ఫార్మాతోపాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి.
- ఈవారంలో సెన్సెక్స్ 4,230.7 పాయింట్లు లేదా 5.77 శాతం లాభపడగా, నిఫ్టీ 1,337.50 పాయింట్లు లేదా 5.88 శాతం ఎగబాకింది.
- బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.64 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.50 శాతం చొప్పున ఎగబాకాయి.
- రంగాలవారీగా వాహన రంగ సూచీ అత్యధికంగా 2.75 శాతం బలపడగా, క్యాపిటల్ గూడ్స్ 2.27 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.20 శాతం, ఇండస్ట్రియల్స్ 2.19%, బ్యాంకింగ్ 2.06%, రియల్టీ 2.02 శాతం చొప్పున బలపడ్డాయి.
- కానీ, ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు మాత్రం పతనం చెందాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

