ముంబై, మే 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. మదుపరులను భారత్-పాక్ ఉద్రిక్తతలు వెంటాడాయి. దీంతో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష సైతం ఇన్వెస్టర్లను ఆచితూచి అడుగులు వేసేలా చేసింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం కోల్పోయి 80,641.07 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 24,379.60 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా రెండు రోజులపాటు అందుకున్న లాభాలకు బ్రేక్ పడినైట్టెంది. సెన్సెక్స్ షేర్లలో ఎటర్నల్, టాటా మోటర్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి.