Domestic LPG cylinder Price Hike | కేంద్ర చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా శనివారం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో సబ్సిడీయేతర వంట గ్యాస్ (14.2 కిలోల) సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.949.50 నుంచి రూ.999.50లకు పెరిగింది. గతేడాది ఏప్రిల్ నుంచి వంట గ్యాస్‌పై రూ.190 పెరిగింది. గత ఆరు వారాల్లో మాత్రం ఇది రెండోసారి మాత్రమే. 2022లో గత మార్చి 22న రూ.50 పెరిగింది.
నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గత మార్చి 22 నుంచి 16 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.10 చొప్పున లీటర్ పెట్రోల్ / లీటర్ డీజిల్ ధర పెరిగింది. ప్రస్తుతం ఏటా 12 సబ్సిడైజ్డ్ సిలిండర్లు పూర్తయితే ప్రతిఒ్కరూ సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ కొనుకోగులు చేయాల్సిందే.
అయితే, దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో ఎల్పీజీ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెబుతున్న పేద మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కింద కూడా సబ్సిడీ చెల్లించడం లేదు.
ఢిల్లీ, ముంబైల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.999.50 అయితే, చెన్నైలో రూ.1015.50, కోల్‌కతాలో రూ.1026లకు లభిస్తుంది. రాష్ట్రాల వారీగా వ్యాట్ ధరల్లో తేడా ఉండటం వల్ల ధరలోనూ తేడాలు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ల (హోటళ్లు, రెస్టారెంట్లు) పై రూ.102.50 పెంచేసింది. దీంతో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2,355.50లకు పెరిగింది.