Air Passengers | న్యూఢిల్లీ, నవంబర్ 18 : దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు రికార్డు స్థాయికి చేరుకున్నారు. ఆదివారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. పండుగ, పెండ్లిళ్ల సీజన్కావడంతో ప్రయాణాలు చేసేవారు అధికంగా ఉన్నారని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ నెల 17న ఒకేరోజు దేశీయంగా నడిచిన 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణించారని తెలిపింది.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గత నెలలో విమాన ప్రయాణికులు 22 శాతం మేర పెరిగినట్లు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. అక్టోబర్ నెలలో 24.95 లక్షల మంది ప్రయాణించారు.