Gold price: గడిచిన వారం రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే స్వల్పంగా మాత్రమే ఈ తగ్గుదల ఉంది. అదే ట్రెండ్ రాష్ట్రంలోనూ కనబడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.62,380 పలుకుతోంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.57,590గా ఉన్నది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.10 తగ్గుదల కనిపిస్తోంది.
ఇక వెండి ధరలు కూడా గత కొన్ని రోజుల నుంచి రోజూ స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.76,900 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల ఉండటంతో.. హైదరాబాద్లో కూడా అదే ప్రభావం కనబడుతోంది.