Diwali With Mi 2023 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ పండుగ సేల్స్ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘దీపావళి విత్ ఎంఐ’ అనే క్యాప్షన్‌తో షియోమీ, దాని అనుబంధ సంస్థల స్మార్ట్ ఫోన్లు రాయితీ ధరకే లభిస్తాయి. ఇటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లోనూ షియోమీ, రెడ్ మీ ఫోన్లు లభిస్తాయి. ఇక షియోమీ సొంతంగా ప్రకటించిన ‘దీపావళి విత్ ఎంఐ’ సేల్స్ శనివారం (శుక్రవారం అర్థరాత్రి) నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సేల్స్ శనివారం అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.
షియోమీ తన ‘దీపావళి విత్ ఎంఐ’ ఆఫర్లలో షియోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్లపై 45 శాతం డిస్కౌంట్, స్మార్ట్ హోం డివైజ్‌లపై 65 శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. షియోమీ/ రెడ్మీ టీవీలపై 60 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తున్నది. ఇక ఎంఐ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే వారికి మరికొన్ని అదనపు ఆఫర్లు లభిస్తాయని షియోమీ తెలిపింది.
రెడ్ మీ నోట్ 12 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్ మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్, రెడ్ మీ 43 అంగుళాల స్మార్ట్ ఫైర్ టీవీ, షియోమీ రోబో వాక్యూమ్ మాప్ 2 ప్రో తదితర ఉత్పత్తులపై డిస్కౌంట్లు ప్రకటించింది షియోమీ.
* గత జనవరిలో మార్కెట్లోకి వచ్చిన రెడ్మీ 12 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999. వివిధ డిస్కౌంట్లతో రూ.13,749 లకే అందుబాటులోకి తెచ్చింది.
* రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ.27,999. ఇప్పుడు రూ.17,999లకే లభిస్తుంది.
* రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ రూ.2,999 (ఎక్స్ షోరూమ్) కాగా, రూ.899లకే సొంతం చేసుకోవచ్చు.
* రెడ్మీ 43 అంగుళాల స్మార్ట్ ఫైర్ టీవీ వాస్తవ ధర రూ.42,999. ప్రస్తుతం దీపావళి పండుగ ఆఫర్ కింద రూ.19,999లకే లభిస్తుంది.
* షియోమీ రోబో వాక్యూమ్ మ్యాప్ 2 ప్రో లాంచింగ్ ధర రూ.39,999 కాగా, ప్రస్తుతం రూ.23,999లకే సొంతం చేసుకోవచ్చు.