హైదరాబాద్, నవంబర్ 9: దివీస్ ల్యాబ్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.510 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.348 కోట్ల లాభంతో పోలిస్తే 46.5 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 22 శాతం ఎగబాకి రూ.2,338 కోట్లకు చేరుకున్నది.