Disney + Hotstar | డిస్నీ + హాట్ స్టార్ పై అదానీ.. కళానిధి మారన్ కన్ను..?
Disney + Hotstar | డిస్నీ + హాట్ స్టార్ ఇండియా ఆస్తులను, వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్, కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్ వర్క్ పోటీ పడుతున్నాయి.
Disney + Hotstar | ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ + హాట్ స్టార్.. భారత్‌లోని తన లైవ్ స్ట్రీమింగ్, టీవీ బిజినెస్ అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. డిస్నీ+ హాట్ స్టార్ భారత్ ఆస్తులను సొంతం చేసుకునేందుకు భారత్ బిలియనీర్ గౌతం అదానీ, సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ తోపాటు మరికొన్ని ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ విషయమై డిస్నీ + హాట్ స్టార్ యాజమాన్యంతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆ వర్గాల కథనం. డిస్నీ, సన్ టీవీ, గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ గానీ దీనిపై స్పందించడానికి ముందుకు రాలేదు. గత జూలైలోనే డిస్నీ + హాట్ స్టార్ తన భారత్ డిజిటల్, టీవీ బిజినెస్ విక్రయించనున్నదని వార్తలు వచ్చాయి.
ఇంతకుముందు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ సంస్థతో డిస్నీ + హాట్ స్టార్ యాజమాన్యం చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్డీటీవీ కొనుగోలు చేయడం ద్వారా మీడియా రంగంలోకి ఎంటరైన గౌతం అదానీ.. డిస్నీ+ హాట్ స్టార్ ఆస్తులను కొనుగోలు చేస్తే తన వ్యాపార విస్తరణకు వీలవుతుందని భావిస్తున్నట్లు ఆ వర్గాల కథనం.
ఐపీఎల్ ప్రసార హక్కుల రిలయన్స్ దక్కించుకోవడంతోపాటు యూజర్లకు ఉచితంగా లైవ్ ప్రసారాలు అందించడంతో డిస్నీ + హాట్ స్టార్‌కు పెద్ద దెబ్బ తగిలింది. మరోవైపు వార్నర్ బ్రదర్స్ హెచ్‌బీఓ కాంట్రాక్ట్ సైతం రిలయన్స్ అనుబంధ వయాకాం 18 సొంతం చేసుకోవడంతో డిస్నీపై ప్రతికూల ప్రభావం పడింది. రోజురోజుకు డిస్నీ హాట్‌స్టార్ సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నాయి. దీంతో ఇండియా వ్యాపార లావాదేవీలను పూర్తిగా విక్రయించడమా.. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకోవడమా? అన్న ఆప్షన్లను డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

